గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన పి.ఓ లు మరియు ఏ.పి.ఓ ఈ నెల 15 మరియు 16 తారీఖులలో తొలివిడత ట్రైనింగ్ ను ఏ.సి కళాశాల నందు నిర్వహించనున్నట్లు నగర కమీషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు పి.ఓలు మరియు ఏ.పి.ఓ లకు ఈ నెల 15,16 తారీఖులలో ఏ.సి కాలేజిలోని మొదటి అంతస్తునందలి లైబ్రరీ బిల్డింగ్ నందు 4 రూముల్లో రూమునకు 62 మంది పి.ఓ, ఏ.పి.ఓ ల చొప్పున ప్రత్యేక మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలియచేశారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే వారి కొరకు రూముల వారీగా ప్రత్యేక టేబుల్స్ మరియు సిబ్బందిని కేటాయిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే పి.ఓ మరియు ఏ.పి.ఓ ల హాజరు ఉదయం మరియు మధ్యాన్నం తప్పనిసరిగా స్వీకరించిచుట జరుగుతుందని, కావున విధులు కేటాయించబడిన తేదీలలో విధిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు. పి.ఓ లకు శిక్షణ సమయంలో పి.ఓ డైరీ మరియు ఇతర మెటీరియల్ శిక్షణ కేంద్రం వద్ద అందజేయుట జరుగుతుందన్నారు. ఎన్నికల ఉత్తర్వులతో పాటు అందించిన పోస్టల్ బ్యాలెట్ ఫారం 12 ను స్వీకరించుట జరుగుతుందని, అందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు అర్హత ఉన్నవారు, వారి ఓటర్ గుర్తింపు కార్డ్ నకలు, ఎన్నికల విధుల ఉత్తర్వుల నకలుతో కలిపి ఫారం 12 పోస్టల్ బ్యాలెట్ అర్జీలను మీకు కేటాయించిన టేబుల్ నందు అందజేయాలన్నారు. అలాగే ఇంజనీరింగ్ అధికారులు విద్యుత్, శిక్షణకు యల్.ఈ.డి టి.వి లు త్రాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు మరియు సదుపాయాలూ ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం వారు ఏ.సి కాలేజీ ప్రధాన గేటు దగ్గర సమాచార బ్యానర్లను, గేటు నుండి రూముల వరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. శానిటరీ విభాగం వారు రూములు టాయిలెట్ లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …