Breaking News

ఎన్నికల అవసరాల కోసం ఈవిఎం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల సంఘం గుంటూరు నగర పాలక సంస్థకు కేటాయించిన ఈవిఎంల్లో కొన్నింటిని గత ఏడాది బాపట్ల జిల్లాకు ఇచ్చామని, వాటిని తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ జిల్లా అధికారులు సోమవారం (15వ తేదీ) అందించనున్నారని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది మే నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వార్ల అనుమతితో గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికల సంఘం కేటాయించిన ఈవిఎంల్లో 100 స్థానిక సంస్థల ఎన్నికల అవసరాల కోసం బాపట్ల జిల్లాకు పంపడం జరిగిందని తెలిపారు. కేటాయించిన 100 ఈవిఎం లు వారికి ప్రస్తుతం అవసరం లేనందున వాటిని తిరిగి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చుటకు రాష్ట్ర ఎన్నికల సంఘం అమోధించినందున సోమవారం మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు పరిధిలో గల బృందావన్ గార్డెన్స్ లోని ఈవిఎంల గోడౌన్ నందు భద్రపరుచుటకు గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *