-అధ్యక్షురాలుగా రుత్తల శ్రీలక్ష్మీదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న భారత మహిళా మండలి గత పాలకవర్గ కాలపరిమితి మార్చితో ముగిసింది. దీంతో 2024`2026 సంవత్సరాలకు నూతన పాలకవర్గాన్ని మహిళా మండలి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో అధ్యక్షురాలిగా రుత్తల శ్రీలక్ష్మిదేవి, ఉపాధ్యక్షురాలుగా తాడువాయి శశిరేఖ, కార్యదర్శిగా వడ్డాది సూర్యకామేశ్వరి, కోశాధికారిగా కె.శచిదేవి, సహాయకార్యదర్శిగా ఆర్ ఉషామాధవి, కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ఆర్ కుమారి, పి.దివ్యవాణి, టి.వసంతకుమారి ఎన్నికయ్యారు. ఫాస్ట్ ప్రసిడెంట్‌గా వి.ఉమాదేవి, ఎడ్వయిజరీ మెంబర్లుగా ఏ.రత్నలక్ష్మి, టి.సాయిలక్ష్మిలు వ్యవహరిస్తారని నూతన అధ్యక్షురాలు రుత్తల శ్రీలక్ష్మిదేవి తెలిపారు.