Breaking News

భారత మహిళా మండలి నూతన కార్యవర్గం ఎన్నిక

-అధ్యక్షురాలుగా రుత్తల శ్రీలక్ష్మీదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న భారత మహిళా మండలి గత పాలకవర్గ కాలపరిమితి మార్చితో ముగిసింది. దీంతో 2024`2026 సంవత్సరాలకు నూతన పాలకవర్గాన్ని మహిళా మండలి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో అధ్యక్షురాలిగా రుత్తల శ్రీలక్ష్మిదేవి, ఉపాధ్యక్షురాలుగా తాడువాయి శశిరేఖ, కార్యదర్శిగా వడ్డాది సూర్యకామేశ్వరి, కోశాధికారిగా కె.శచిదేవి, సహాయకార్యదర్శిగా ఆర్‌ ఉషామాధవి, కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ఆర్‌ కుమారి, పి.దివ్యవాణి, టి.వసంతకుమారి ఎన్నికయ్యారు. ఫాస్ట్‌ ప్రసిడెంట్‌గా వి.ఉమాదేవి, ఎడ్వయిజరీ మెంబర్లుగా ఏ.రత్నలక్ష్మి, టి.సాయిలక్ష్మిలు వ్యవహరిస్తారని నూతన అధ్యక్షురాలు రుత్తల శ్రీలక్ష్మిదేవి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *