తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిజంలో ప్రతిష్టాత్మకంగా విశిష్ట సేవలు అందించిన జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ ఎంతైనా అభినందనీయులని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అన్నారు. శనివారం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, అంబేద్కర్ రీడింగ్ కాన్ఫరెన్స్ హాల్లో టాలెంట్ ఎక్స్ప్రెస్, టివి 7ఇండియా న్యూస్, అధినేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎక్సలెన్సీ , అవార్డు అందజేశారు. శాలువా నిలువెత్తు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ, జర్నలిస్టుల వృత్తి సాహసంతో కూడుకున్నదని, ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి చేరి అవార్డు అందుకోవటం జరగదని, శ్యామ్ సాగర్ ను అభినందించారు. టాలెంట్ ఎక్స్ప్రెస్ అధినేత, కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ అవార్డును అర్హత కలిగిన వారికి అందజేస్తున్నామని, అంబేద్కర్ పేరుతో అవార్డును అందజేయడం, ఆ మహనీయుడి, త్యాగాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు. అంబేద్కరైట్ ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి యండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ అంబెడ్కర్ త్యాగనిరతిని గుర్తుంచుకొని అవార్డులు ప్రకటించి అందజేయడం ,తెనాలి జర్నలిస్టులు నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమం అని అన్నారు. సమాజసేవలో తమదైన ముద్రవేసుకున్న జర్నలిస్టులకు అవార్డులను ప్రదానం చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం, కనపర్తి డేవిడ్, బాబురావు, పుట్ల పున్నయ్య, శేఖర్, ఉన్నం భూషణం, మేకల సుబ్బారావు, గుమ్మడి ప్రకాష్ రావు, ఎన్ జె శామ్యూల్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …