-సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు…
-లిఫ్ట్ మార్గం ద్వారా ప్రధాన విగ్రహం వద్దకు అనుమతి లేదు
-జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లిరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు దిశా నిర్దేశం చేసి భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా స్వరాజ్య మైదానంలోని 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో సందర్శకులు, సామాజికవేత్తలు, అంబేద్కర్ వాదులు ఆయనకు నివాళులు అర్పించేలా ఆయన తాత్కాలిక విగ్రహాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నివాళులు అర్పించేందుకు విచ్చేసే అంబేద్కర్ అభిమానులు, సామాజిక సంఘాల నాయకులు ప్రవర్తన నియమావళి ని దృష్టిలో పెట్టుకుని నివాళులు అర్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. దిల్లీరావు తెలిపారు. సామాజిక న్యాయ మహా శిల్పం పాదాల వద్ద కు యిప్పటి వరకు సందర్శకులను అనుమతించ లేదని ఇదే పద్ధతిని 14 వ తేదీన కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అంబేద్కర్ కు నివాళులు అర్పించేలా ప్రత్యేకమైన వసతులతో ఏర్పాటు చేశామని వివరించారు. సామాజిక న్యాయమహా శిల్పం ప్రాంగణాన్ని సందర్శించే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలన్నారు.