– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్‌జీఎస్‌పీ) తదితర మార్గాల ద్వారా 1,250 ఫిర్యాదులు రాగా 1,216 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ ఎస్.డిల్లీరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటరు హెల్ప్‌లైన్ (1950) ద్వారా 195 ఫిర్యాదులు రాగా 195 ఫిర్యాదుల పరిష్కారం పూర్తయిందన్నారు. ఎన్‌జీఎస్‌పీ ద్వారా 384 ఫిర్యాదులు రాగా 374 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. అదే విధంగా వాట్సాప్ నంబరు (9154970454) ద్వారా 29 ఫిర్యాదులు రాగా 26 ఫిర్యాదులు, కాల్ సెంటర్ (0866-2570051) ద్వారా 22 ఫిర్యాదులు రాగా 22 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. కంప్లయింట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) ద్వారా 54 ఫిర్యాదులు రాగా 46 ఫిర్యాదులను, సీఈవో మెయిల్స్ ద్వారా 14 ఫిర్యాదులు రాగా 10 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా 490 ఫిర్యాదులు రాగా 487 ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించినట్లు వెల్లడించారు. 62 ప్రతికూల వార్తలకు సంబంధించి 56 అంశాలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి నాణ్యతతో పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.