– డా. బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలి
-కలెక్టర్ డా.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ అభివృద్ధికి డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని , అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత పిలుపు నిచ్చారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ సమాజ అభివృద్ధి కొరకు వారి ఆలోచన, మేధాశక్తితో చక్కని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని హక్కులను కల్పించే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం చక్కగా అమలుపరుస్తున్నామని అన్నారు. బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా విద్య వల్లనే సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించవచ్చునని నమ్మారని పేర్కొన్నారు. స్త్రీ విద్యకు కృషి చేశారన్నారు. ఆయన పోరాటాన్ని మనం ఎప్పటికీ మరచిపోకుండా, స్ఫూర్తిదాయకమైన వారి ఆలోచనలను, మార్గదర్శకాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కలెక్టర్ మాధవీలత స్పష్టం పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, డిఆర్ఓ జె.నర్సింహులు, బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.