Breaking News

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు లోక్ సభ మరియు శాసన సభ 2024 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై అందిన వివిధ ఫిర్యాదుల పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నామని సదరు నివేదికను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అందులో భాగంగా.. 14-04-2024 (ఆదివారం) మధ్యాహ్నం వరకు నివేదికల మేరకు ప్రింట్ మీడియా ద్వారా 253 ఫిర్యాదులు అందగా 251 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది, మిగిలినవి పురోగతిలో వున్నాయి. కంప్లైంట్ మానిటరింగ్ యాప్/సీఈవో ద్వారా 47 ఫిర్యాదులు అందగా 47 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది.

ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., పోలీసు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ద్వారా చేపట్టిన సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి (14-04-2024) వరకు.. జిల్లా వ్యాప్తంగా రూ. 67.81 లక్షలు మేర నగదు, 4713 లీటర్లు విలువ రూ. 22.58 లక్షల లిక్కర్, ఇతర వస్తువులను కలిపి మొత్తం రూ. 3.38 కోట్లు సీజ్ చేయడం జరిగింది. సి -విజిల్ ద్వారా అందిన ఫిర్యాదులు నేటి వరకు మొత్తం 600 కాగా అందులో సరియైన ఫిర్యాదులు 457 కు హాజరై పరిష్కరించడమైనదని, ఫిర్యాదు పరిష్కార సరాసరి సమయం సుమారు 31.26 నిమిషాలు గా ఉందని తెలిపారు. 143 ఫిర్యాదులు నిరాధారమైనవిగా గుర్తించామని తెలిపారు. ఎన్ జి ఎస్పీ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులు 676 లో 659 పరిష్కరించడం జరిగిందని తెలిపారు. సీఈఓ ఆంధ్రప్రదేశ్ నుండి అందిన 47 ఫిర్యాదులలో 47 పరిష్కరించడం జరిగిందని తెలిపారు.

అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 23 మంది వాలంటీర్లను తొలగించడం జరిగిoదని, రెగ్యులర్ ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలలో భాగంగా 7 మందిని సస్పెండ్ చేయడమైనదని, ఒకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్స్ చేయడం జరిగిందని, ఒకరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయబడినది అని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు 7 మందిని సర్వీసు నుండి తొలగించడం జరిగిందని,ఒకరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయబడినది అని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా నేటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ఏర్పాటు చేసిన అనధికార ప్రకటనలు 30,861 తొలగింపు చేయడం జరిగిందని తెలిపారు.

అలాగే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ త్రిసభ్య కమిటీ ద్వారా సామాన్య ప్రజలకు, వ్యాపారులకు చెందిన సీజ్ చేసిన నగదు 23 కేసులలో సుమారు రూ. 42,68,380 కాగా వాటిని సమీక్షించి నేటి వరకు 20 కేసులకు సంబంధించిన మొత్తం రూ. 35,58,580 ను సంబంధీకులకి తిరిగి అందజేయడం జరిగిందనీ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *