విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని గుణదల తూర్పు నియోజకవర్గ కార్యాలయం,2వ డివిజన్ బెత్లెహాం నగర్,దగ్గర డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని ,దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ,రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన, వెనుకబడిన,దళిత ,పీడిత వర్గాలకు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిర్మలాకుమారి వైసీపీ నాయకులు కోటి నాగులు, డేవిడ్ రాజు, చందా కిరణ్, రవి ప్రకాష్, కనపర్తి బాబు, అలంకర్ బాబు, క్లైవ్, చెన్నూ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …