విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా॥ బి. ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఇన్ చార్జ్ అడ్మిన్ డి.సి.పి. కృష్ణ మూర్తి నాయుడు మరియు ఎస్.బి. ఏ.డి.సి.పి. టి.కనకరాజు లు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు డా|| బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డా॥ బి.ఆర్. అంబేద్కర్ చేసిన ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సంస్కరణలు, బడుగు, బలహీన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.బి.ఏ.డి.సి.పి. కె.ఆర్.ప్రసాద్, సి.ఎస్.బి.ఏ.సి.పి., బి.పార్థసారథి, ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని డా॥ బి.ఆర్. అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించడం జరిగింది.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …