విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “స్కేటింగ్” ఆంధ్రప్రదేశ్ స్కేటర్స్ అండర్ -11 బాలుర విభాగంలో ఒక రజత పతకం మరియు అండర్ -14 బాలురు విభాగంలో ఒక కాంస్య మరియు బాలికల విభాగంలో ఒక కాంస్య పతకం సాదించారు. క్రీడాకారులను అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ , సమగ్ర శిక్ష ఎస్పీడీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “స్కేటింగ్ ” అండర్ – 11 బాలుర విభాగంలో ఒక రజత పతకం మరియు అండర్ -14 బాలురు విభాగంలో ఒక కాంస్య పతకం మరియు బాలికల విభాగంలో ఒక కాంస్య పతకం సాదించినారు అని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు.
ది: 11-04-2024 నుంచి ది: 15-04-2024 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం “సాత్నా”లో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
“స్కేటింగ్ ” అండర్ – 11 బాలుర “రోడ్ రేస్ – రింక్ -1 క్వాడ్స్” విభాగంలో రజత పతకం :
పసలపూడి హేమవర్ధన్,సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొబ్బరితోట ,తాడేపల్లిగూడెం,పచ్చిమ గోదావరి జిల్లా .
“స్కేటింగ్ ” అండర్ -14 బాలుర “రోడ్ రేస్ – రింక్ -1 క్వాడ్స్” విభాగంలో కాంస్య పతకం
అన్నిపి మహిత్ సాయి కౌశిక్ ,ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీరామ్ నగర్ ,రాజమండ్రి ,తూర్పు గోదావరి జిల్లా .
“స్కేటింగ్ ” అండర్ -14 బాలికల “రోడ్ రేస్ – 2 ఇన్ లైన్ ,రింక్ 3” విభాగంలో కాంస్య పతకం
కెల్లా భవ్య శ్రీ ,ది బోది స్కూల్ ,రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా.