-ఈ నెల 25 వ తేది నాటికి ఇంటిగ్రేటెడ్ ఓటర్ జాబితాను సిద్ధం చేయాలి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాకు సంబంధించి ఈ నెల 14 వ తేదీ వరకు వచ్చిన ఫారం -6 క్లెయిములు , ఫారం – 8లో చిరునామాల మార్పు కొరకు సంబందించి వచ్చిన క్లెయిములను సంబందిత ఈఆర్ఓ, ఎఈఆర్ఓలు ఈ నెల 22 వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఈ.ఆర్.ఓ, ఎ.ఈ ఆర్.ఓ లతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాకు సంబందించి ఈ నెల 14 వ తేదీ వరకు వచ్చిన ఫారం -6, ఫారం –8 లో చిరునామాల మార్పు కొరకు వచ్చిన క్లెయిములను 22 వ తేదీ లోపు పరిష్కరించాలని అన్నారు. తదనుగుణంగా ఎన్నికల నామినేషన్లు ఆఖరు తేది 25 నాటికి ఇంటిగ్రేటేడ్ ఓటర్ల జాబితా సిద్ధం కావాల్సి ఉంటుందనీ కలెక్టర్ ఆదేశించారు. ఈ టెలి కాన్ఫెరెన్స్ లో ఈ.ఆర్.ఓ., ఎ.ఈ ఆర్.ఓ లు ఎలెక్టోరల్ రోల్స్ నోడల్ అధికారి దేవేంద్ర రెడ్డి హాజరయ్యారు.