Breaking News

సేవా దృక్పథంతో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ కోర్సులో శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ సేవా సంస్థ అధ్యర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ (శాప్‌ఎస్డీ) కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు వంగర సురేష్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం గాంధీనగర్‌ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 22 సంత్సరాలుగా నిస్వార్ధ ప్రజాసేవలో మానవ సేవా సంస్థ మన రెండు తెలుగు రాష్ట్రా లలో ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మందికి ఉచితముగా వైద్య సేవలు, 900 పైగా ఉచిత వైద్య శిబిరాలు, 4500 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు 6000 మందికి ఉచితంగా కళ్ళ అద్దాలు, 5000 మందికి ఉచితంగా విద్య వంటి అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు ఆయన వివరించారు. అదే స్పూర్తితో ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విద్యార్థినీ విద్యార్థులకు నా వంతుగా విద్యా రంగంలో సేవ చేయాలనే దృక్పథంతో ఉచితంగా సాఫ్ట్వేర్‌ కోర్స్‌ (శాప్‌ఎస్డీ)లో డిగ్రీ చదివిన నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా, బాపట్ల, ప్రకాశం, కృష్ణ జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలలోని డిగ్రీ చదివిన, విద్యార్థినీ విద్యార్థులకు విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు సురేష్‌ తెలిపారు. 14వారాల కాలపరిమితి గల శిక్షణలో శని, ఆదివారాల్లో 3గం.ల పాటు తరగతులు జరుగుతాయని ఆయన తెలిపారు. మెరుగైన టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇచ్చి, వారిని ఉత్తమ శిఖరాలకు చేరుకునే విధంగా శిక్షణ ఇచ్చి తగు సూచనలు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన యువత సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7093529750 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని ఫౌందర్‌ వంగర సురేష్‌ కోరారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *