Breaking News

రూ. 7.06 కోట్ల విలువైన న‌గ‌దు, మ‌ద్యం, ఇత‌ర వ‌స్తువుల సీజ్‌

– జిల్లాలో స‌మ‌ర్థ‌వంతంగా ఎల‌క్ష‌న్ సీజ‌ర్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ అమ‌లు
– క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళిని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని.. అదే విధంగా సీజ‌ర్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా అమ‌ల‌వుతోంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 7.06 కోట్ల విలువైన న‌గ‌దు, మ‌ద్యం, మ‌త్తు ప‌దార్థాలు, విలువైన వ‌స్తువులు, ఉచితాలు త‌దిత‌రాల‌ను సీజ్ చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రూ. 3.16 కోట్ల న‌గ‌దుతో పాటు రూ. 94.16 ల‌క్ష‌ల విలువైన 19,583 లీట‌ర్ల మ‌ద్యం, రూ. 12.20 ల‌క్ష‌ల విలువైన 1,84,201 గ్రాముల మ‌త్తు ప‌దార్థాలు, రూ. 2.32 కోట్ల విలువైన 7,758 గ్రాముల విలువైన లోహాలు, రూ. 6.43 ల‌క్ష‌ల విలువైన 132 ఉచితాలు త‌దితరాల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి రూ. 1.16 కోట్ల మేర సీజ‌ర్లు జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. అదే విధంగా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 48.59 ల‌క్ష‌లు, నందిగామ‌లో రూ. 20.23 ల‌క్ష‌లు, తిరువూరులో రూ. 85.84 ల‌క్ష‌లు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో రూ. 2.75 కోట్లు, విజ‌య‌వాడ తూర్పులో రూ. 64.26 లక్ష‌లు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో రూ. 94.81 ల‌క్ష‌ల విలువైన సీజ‌ర్లు జ‌రిగిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు వివ‌రించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *