Breaking News

త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ నంబర్లు: 91001 21300, 91001 21306,
-వీటితోపాటు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 63049 90363,
-మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 99892 06318 కు ఫోన్ ద్వారా తెలుపవచ్చు
-ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి. వెంకటరమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వేసవి త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డబ్ల్యూఎస్ సర్కిల్ పరిధిలో డ్రాట్ సెల్ (కమాండ్ కంట్రోల్ రూమ్) ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి. వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో త్రాగు నీటి సమస్యలపై ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ నకు ఫిర్యాదు చేసిన వెంటనే తగు చర్యలు చేపట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పర్యవేక్షక ఇంజినీర్ మరియు సిబ్బంది అందుబాటులో ఉంటారని, త్రాగునీటి సమస్యలపై ప్రజలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ నేరుగానే టెలిఫోన్ ద్వారా తమ ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. ఎటువంటి త్రాగునీటి సమస్యలు ఉన్నా ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఇ డి. వెంకట రమణ – 9100121300, సిబ్బంది జి. పద్మజ – 9100121306, ఎల్ పి ఎస్ ఆర్. కృష్ణ – 6304990363, ఎం. బాలచంద్ర – 9989206318 నెంబర్లకు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చునన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *