గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధుల పై అందిస్తున్న శిక్షణను శ్రద్దగా అవగాహన చేసుకుంటే పోలింగ్ సాఫీగా నిర్వహించడానికి వీలు కల్గుతుందని నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులు కేటాయించబడిన పిఓలు, ఏపిఓలకు సోమవారం స్థానిక ఏసి కళాశాలలో జరుగుతున్నతొలివిడత శిక్షణను కమిషనర్ & ఆర్ఓ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ & రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిఓలు, ఏపిఓలుగా విధులు కేటాయించబడిన వారికి ఏసి కాలేజిలో తొలివిడత శిక్షణ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధుల పై సీనియర్ మాస్టర్ ట్రైనర్ల ద్వారా అందిస్తున్న శిక్షణను విధులు కేటాయించబడిన అధికారులు శ్రద్ధగా అవగాహన చేసుకుంట, పోలింగ్ రోజు ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి వీలుకల్గుతుందని తెలిపారు. శిక్షణలో వీడియో క్లిప్పింగ్స్, డెమో ఈవిఎంల పై ఈవియంలు, వివి ప్యాట్ కమీషనింగ్, మాక్ పోల్, ఫారం-17సి, పిఓ డైరీ, ఇతర ఫారాలు నింపడం వంటి కీలక అంశాలు వివరించడం జరుగుతుందన్నారు. అలాగే ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగుల నుండి పోస్టల్ బ్యాలెట్ కి సంబందించి ఫారం-12ని సిబ్బందికి అందించాలన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి ఎల్ఈడి స్క్రీన్ లు, మైక్ లు తగిన విధంగా ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, ఏఈఆర్ఓ వెంకట లక్ష్మి, డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, ఏఈ సునీల్ కుమార్, మేనేజర్ యస్.యన్. ప్రసాద్ పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …