Breaking News

ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పిపిటి, డెమో బ్యాలెట్ బాక్సులు, పేపర్ల ప్రదర్శన ద్వారా శిక్షణ

-ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వర్తించాలి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని.. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, డా. కే. మాధవీలత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.

సోమవారం కొవ్వూరు దీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో సార్వత్రిక ఎన్నికల విధులకు నియమించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, డా. కే. మాధవీలత మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపేందుకు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

పొలింగ్ ముందు రోజున, పోలింగు రోజున, పోలింగు అనంతరము చెయ్యవలసిన బాధ్యతలు పై మాస్టర్ ట్రైనర్ లు సమగ్ర శిక్షణా కార్యక్రమం  ఇవ్వడం జరిగిందని, ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని కోరారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు వద్ద అందచేసే మెటీరియల్ చెక్ లిస్టు ప్రకారం సరి చూసుకొవాలని తెలియ చేశారు.  ఎన్నికల ఓటింగు పూర్తి అయిన తదుపరి రిసీప్షన్ కేంద్రాలకు అందచేసే వరకు అత్యంత జగ్రత్తగా వహరించాలన్నారు. ఓటరు ఓటు హక్కు వినియోగించడం పై అత్యంత సిక్రేసి  ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా పోలింగు ను సమర్థవంతంగా పూర్తి చెయ్యగలమని మాధవీలత పేర్కొన్నారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు.. డెమో బ్యాలెట్ బాక్సులు, ఈవిఎం, వివిప్యాడ్ చూపిస్తూ.. వాటి నిర్వహణ ఎలా చేపట్టాలనే అంశాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కొవ్వూరు సుబ్ కలెక్టర్, నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీ వాత్సవ్ కొవ్వూరు సహయ రిటర్నింగ్ అధికారులు, పి వో లు, ఎపివొ లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *