రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు సమర్థ వంతంగా పూర్తి చేయడంలో ప్రిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించి విధుల నిర్వహణా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి/ జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు .
సోమవారం ఉదయం సాధారణ ఎన్నికలు-2024 కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ లు(ఏ ఎమ్ ఎల్ టి) ల ఆద్వర్యంలో పీవో ఎపిఓ లకి తొలి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
.
ఈ సందర్భం గా, రాజమండ్రి రూరల్ నియోజక వర్గ ఆర్వో , జెసి ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ రూరల్ నియోజక వర్గ పరిధిలో ఏప్రిల్ 15 వ తారీకు న 774 మంది ఎన్నికల సిబ్బంది కి ఎన్నికల ప్రక్రియలో నిర్వర్తించాల్సిన బాధ్యత లపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పొలింగ్ ముందు రోజున, పోలింగు రోజున చెయ్యవలసిన విధులు నిర్వహించే క్రమంలో చక్కటి సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా సమన్వయం సాధించడం ద్వారా ఎన్నికల విధులకు ఆటంకం లేకుండా పూర్తి చెయ్యడం సాధ్యం అన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరుగుతుందనీ తేజ్ భరత్ అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ లో శిక్షణ తరగతులకు హాజరైన వారి నుంచి ఫారం-12 లను కూడా స్వీకరించడం జరిగిందన్నారు. ఆమేరకు గ్రామ రెవిన్యూ అధికారు లకు సూచనలు ఇచ్చామన్నారు. శిక్షణా తరగతి గదులు సందర్శించి హాజరు అయిన ఎన్నికల సిబ్బంది తో మాట్లాడి తగిన సూచనలు ఇవ్వడమైనది. ఎపిక్ నిర్దారణ కోసం డిజిటల్ అసిస్టెంట్ లకు కూడా వారి పాత్రను వివరించి తగిన సూచనలు ఇవ్వడమైన దన్నారు. శిక్షణలో భాగంగా వారికీ అందచేసిన శిక్షణ పై మూల్యాంకన పరిక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమం లో ,డిప్యూటీ కలెక్టర్ ఐ. సాయి బాబు, రూరల్ తహశీల్దార్ వై. కె. వి. అప్పారావు, కడియం తహశీల్దార్ బి. రమాదేవి, ప్లానింగ్ అధికారి కోటయ్య , డిప్యూటీ తహశీల్దార్లు , మాస్టర్ ట్రైనర్ లు, పీ వో లు, ఎపిఓ లు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.