Breaking News

నిరంతర పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించాలి…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరూ ఎంతో బాధ్యతగా వారికీ కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా . కె.  మాధవి లత పేర్కొన్నారు.

సోమవారం స్థానిక సమీశ్ర గూడెం వికాస్ డిగ్రీ కళాశాల నందు నిడదవోలు అర్బన్ నియోజక వర్గ పిఓలు,  ఏపీవో లకు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె మాధవ్ లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి కేటాయించిన విధులను బాధ్యతా గా నిర్వహించి విజయవంతం చేద్దాం అని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి,  నిబంధనలకు అనుగుణంగా పాటించాల్సిందిగా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ లో ఏడాది కాలంగా అధికారులు నిరంతర పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించి, నేడు పోలింగు దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు ఏంతో బాధ్యత కలిగి నిర్వర్తించాల్సి ఉందన్నారు. కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు మేరకు గతంలో కంటే ఎన్నికలు ఎంతో సులభతరంగా రూపొందించి, ఆమేరకు దిశా నిర్దేశనం చేయటం జరిగిందని అన్నారు.  ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ఈవీఎం ల పై అవగాహన కల్పించడం కోసం, ట్రైనింగ్ నిమిత్తం కేటాయించిన వాటినీ అందుబాటులొ ఉంచామని తెలిపారు.  పోలింగు రోజున విధులను నిర్వర్తించే అధికారులు సిబ్బంది ఎన్నికల సమయంలో ముఖ్యమైన నాలుగు ఐదు రోజులు ఎంతో ఓపికగా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కోరారు .

మాక్ పొలింగ్, పోలింగు ప్రక్రియ నుంచి, ఎన్నికల సిబ్బంది పోలింగ్ ముగిసే వరకు జాగ్రత్తగా విధి నిర్వహణలో జవాబుదారీ తనం కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఓటింగు ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఈవిఎమ్ కి చెందిన క్లోజింగ్  నొక్కటం మర్చిపోవద్దని ఆమె సూచించారు.  గతంలో సీల్ కవర్లను ముందు రోజే తయారు చేసుకోవాల్సి వచ్చేదని ప్రస్తుతం అదే రోజు సీల్ కవర్ తయారు చేసుకోవచ్చని ఆమె అన్నారు.

మాస్టర్ ట్రైనర్ల ద్వారా పొలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి రీసీప్షన్ వరకు వివిధ దశల్లో నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలు పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సంభందిత శిక్షణ కార్యక్రమానికి చెందిన విడియో క్లిప్పింగ్ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందనీ, పునశ్చరణ చేసుకోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం సాధ్యం అవుతుందని అన్నారు. అందరం సమన్వయంతో పనిచేయాలని , ఎన్నికలను విజయవంతంగా చేద్దాం అని కోరారు.

శిక్షణా కార్యక్రమంలో ఎస్ డీ సీ, నిడదవోలు రిటర్నింగ్ అధికారి ఆర్. రమణ నాయక్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం. భాను ప్రకాష్, సహయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లుపిఓలు ఏపీవోలు ఇతర పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *