రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియని ఎన్నికల కమీషన్ ఎంతో సరళీకృతం చెయ్యడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం స్థానిక పిడీం గొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో రూరల్ నియోజక వర్గ పి వో, ఎపివో ల శిక్షణ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల విధులు రాజ్యాంగ బద్దత కలిగి నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతం కంటే భిన్నంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నో సరళీకృత విధానాలను ఎన్నికల కమీషన్ రూపొందించడం జరిగిందనీ తెలియ చేశారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్య వైఖరి వ్యవహరించకుండా , నిబద్దత కనపరిచితే విజయవంతంగా నిర్వహించడం సాధ్యం అవుతుందని మాధవీలత తెలియ చేశారు. ఎన్నికల ప్రక్రియ గత ఏడాది కాలంగా వివిధ స్థాయిలో అధికారులూ ఎంతో కసరత్తు చేసి, ప్రస్తుతం ఎన్నికల నిర్వహణా కు చేరుకోవడం జరిగిందనీ తెలియ చేశారు.
అందరం సమన్వయంతో కలిసి పనీ చెయ్యడం ద్వారా మాత్రమే ఎన్నికల సజావుగా పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని అన్నారు. పోలింగు ముందు రోజు ఫెసిలిటెషన్ కేంద్రం వద్ద పోలింగ్ మెటీరియల్ తీసుకోవడం దగ్గర నుంచి పొలింగ్ ముగిసిన తదుపరి రిసెప్షన్ కేంద్రం వద్ద వాటినీ అందచేసే వరకు బాధ్యత అందరిపై ఉందన్నారు. టీమ్ లీడర్ గా ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా పనీ చేస్తే ఎన్నికలను జిల్లాలో పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఎన్నికల విధులలో నియమించిన ఉద్యోగులు విధులకు తప్పని సరిగా హజరు కావాలని కోరారు.