Breaking News

సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం.

-జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా , నిష్పక్షపాతంగా..
-ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించిన..
-కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మాధవీలత, ఎస్పీ జగదీష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా , నిష్పక్షపాతంగా, సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత , ఎస్పి పి జగదీష్ లు తెలియ చేశారు. మంగళవారం కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ ను ప్రారంభించి అనంతరము మీడియా పాయింట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పి, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత మాట్లాడుతూ , మార్చి 16 వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మే 13 న పొలింగ్ డే ను పురస్కరించుకుని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి లో ఏప్రియల్ 18 వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రియల్ 18 నుంచీ ఏప్రియల్ 25 వరకూ కార్యాలయ పని రోజులలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఏప్రియల్ 21 ఆదివారం సెలవు రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ నామినేషన్ లను ఆయా రోజులలో ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకు స్వీకరించడం జరుగుతుందని తెలియ చేశారు. నామినేషన్లను దాఖలు చేసే క్రమంలో ఆర్వో కార్యాలయం వద్ద 100 మీటర్లు వరకూ 3 వాహనాల అనుమతించడం, నామినేషన్ వేసే వ్యక్తి తో పాటుగా మరో నలుగురిని మాత్రమే ఆర్వో ఛాంబర్ లోకి అనుమతించడం జరుగుతుందని అన్నారు.

నియోజక వర్గాల వారీగా నామినేషన్లను స్వీకరించేందుకు పార్లమెంటు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఛాంబర్ లో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి లో రాజమండ్రి రూరల్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో, రాజమండ్రీ అర్బన్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో, కొవ్వూరు సబ్ కలెక్టర్ ఛాంబర్ లో, రాజానగరం , అనపర్తిలలో ఎంపిడివో కార్యాలయంలో, నిడదవోలు గ్రామ కచేరీ లో, గోపాలపురం తహసీల్దార్ కార్యాలయం లో నామినేషన్ పత్రాలని స్వీకరించేందుకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఎమ్ సి సి ఉల్లంఘన సంభందించి 41 నమోదు కాగా 39 పరిష్కరించామని, రెండు పరిశీలన లో ఉన్నట్లు తెలిపారు. 46 మంది ఎంప్లాయీస్ పై చర్యలు తీసుకోవడం జరిగిందనీ, 1796మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సేవా పోర్టల్ ద్వారా 312 ఫిర్యాదులు అందయన్నారు. జిల్లాలో 9644మంది పొలింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు. 422మంది మైక్రో అబ్జర్వర్స్, 16 మంది నోడల్ అధికారులు, 3 షిఫ్ట్ లలో 63 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 24, విడియో సర్వైవల్ బృందాలు, 23 మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ బృందాలు,  స్టాస్టిక్ సర్వైల్లన్స్ బృందాలు 63, విడియో వ్యుయింగ్ బృందాలు 26, అకౌంటింగ్ బృందాలు 16 , మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ తో పాటు 24 x 7 సమీకృత కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణా చేస్తున్నట్లు మాధవీలత  తెలిపారు.

ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావడం కోసం 2,120 కార్యక్రమాలను నిర్వహించి, అందులో సుమారు 6లక్షల 60, వేల మంది ఓటర్లను భాగస్వామ్యం చేశామన్నారు.

జిల్లాలో ఏప్రియల్ 10వ తేదీ నాటికి 16,16,918 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 28,010 మంది 85 ఏళ్లు పైబడిన, 40 శాతం పైబడిన దివ్యంగ ఓటర్లు ఉన్నట్లు వారికీ హోం ఓటింగు సంబంధించిన నిర్దుష్టమైన కార్యచరణ సిద్దం చేసి ఫారం 12 డి ద్వారా ఏప్రియల్ 22 వరకూ దరఖాస్తులు  స్వీకరించటం జరుగుతున్నట్లు తెలియ చేశారు. దరఖాస్తులను అనుసరించి క్షేత్ర స్థాయిలో రూట్ మ్యాప్ సిద్దం చేసుకొని ఆమేరకు ఇంటి వద్దనే ఓటు హక్కును కల్పించడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లాలో అత్యవసర సేవలు అందించే వివిధ శాఖల విభాగాలలో పనీ చేసే ఉద్యోగులకి ఫారం 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కల్పించడం జరుగుతోందనీ అన్నారు. సి విజిల్ ద్వారా 481 కాల్స్ వచ్చాయనీ వాటిలో 382 పరిష్కారం చేసినట్లు, 99 ఉపసంహరించడం జరిగిందనీ అన్నారు. 100 నిమిషాల్లో పరిష్కారం చేయవలసిన ఉండగా జిల్లాలో సగటున 32 నిమిషాల్లో వాటినీ పరిష్కారము చేసినట్లు తెలిపారు.

జిల్లాలో 847 ప్రాంతాల్లో 1577 పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మాధవీలత తెలియ చేశారు. వాటిలో 181 ప్రదేశాల్లో 367 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.

సువిధా /ఎన్కోర్ ద్వారా 597 దరఖాస్తులలో 505 కు అనుమతి ఇచ్చామని, 63 తిరస్కరించగా, మిగిలిన 29 పురోగతిలో ఉన్నయ్యన్నారు.

సీజర్ నిర్వహణా వ్యవస్థ ద్వారా రూ. 2.12, కోట్ల విలువైనవి సీజ్ చెయ్యడం జరిగిందన్నారు.

మీడియా సమావేశం లో ఎస్పి పి జగదీష్ మాట్లాడుతూ…
జిల్లా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ ప్రక్రియ ప్రారంభమైందని ఇందులో భాగంగా ఇప్పటి వరకు గతంలో వివిధ రకాల కేసుల్లో ఉన్న 6,006 మంది నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 236 లైసెన్స్ వెపెన్స్ ఉన్నాయని ఇందులో 177 డిపాజిట్ చేయడం జరిగింది, స్పోర్ట్స్, బ్యాంకుల వద్ద వున్న 58 వెపన్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. 2014, 2019 నిర్వహించిన ఎన్నికల్లో గొడవలు జరిగిన 230 క్రిటికల్ గ్రామ, వార్డుల పిఎస్ లను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతంలో మార్చి 1 నుంచి పోలీస్ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో మార్చి ఫస్ట్ నుంచి 4 సి ఎస్ ఎఫ్ కంపెనీ బాలాగాలు విధులు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలు వాటిని గుర్తించి ఎస్ హెచ్ ఓ లు,సిఐలు, రిస్క్యూటివ్స్ విజిట్ చేసి అదే రోజు సాయంత్రానికి కమిటీలో సమాచారాన్ని అందిస్తూ ఓటర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధైర్యంగా ఓటు వేసే విధంగా ముందస్తు భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 8 చెక్ పోస్టులు పని చేస్తున్నాయని, వాటికి అదనంగా మరో 8 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు జిల్లా రు.5.41 కోట్లు సీజ్ చేయటం జరిగిందని, ఇందులో రు.1.22 కోట్లు కాష్, రు.2.75 కోట్లు లిక్కర్, రు.29 లక్షలు డ్రగ్స్, రు. 1.10 లక్ష్మి ఇతర సామాగ్రిని సీట్ చేయటం జరిగింది అని జగదీష్ పేర్కొన్నారు. జిల్లాలో 367 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వెబ్ కాస్టింగ్, పోలీసు భద్రత సిబ్బంది నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4 కేంద్ర సాయుధ బలగాలు నాడు జరిగిందని , మరో నాలుగు భద్రత బృందాల రానున్నయని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి 300 గ్రూపులను నిర్ధారించడం జరిగిందని వాట్సాప్, ఇంస్టాగ్రామ్స్, ఫేస్బుక్, ట్విట్టర్ లలో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫేక్ న్యూస్ వచ్చిన ఆ గ్రూప్ అడ్మిన్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పారదర్శకంగా స్వేచ్ఛగా వాటర్ తమ ఓటు హక్కును వినియోగించుకుని విధంగా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంటు సహాయా ఆర్వో ఎమ్. కృష్ణ నాయక్ లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *