గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల చెయ్యడం జరుగుతుందనీ గోపాలపురం (ఎస్ సి) నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఎల్ శివజ్యోతి తెలియ చేశారు.
మంగళవారం గోపాలపురం ఆర్వో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆర్వో శివజ్యోతి మాట్లాడుతూ, గురువారం ఉదయం 11. గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది అని తెలియ చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద 100 మీటర్లు వరకూ 144 సెక్షన్ అమలు లో ఉంటుందనీ తెలియ చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు 1 + 4 వరకూ మాత్రమే అనుమతిస్తామని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటిలో నిలబడే అభ్యర్ధులు సహకరించాలని కోరారు. నామినేషన్ దాఖలు చెసే వ్యక్తితో పాటు ప్రతిపాదకుడు తప్పని సరిగా రావాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియ ఏప్రియల్ 15 తో ముగిసినట్టు, అర్హత కలిగిన ఓటర్లు మే 13 న జరిగే పొలింగ్ రోజున ఓటు హక్కును కల్పించడం జరుగుతుందనీ తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ డిప్యూటి కలెక్టర్ పీ. సువర్ణ, సహయ రిటర్నింగ్ అధికారులు వనజాక్షి, , రాజకియ పార్టీల ప్రతినిధులు వైసిపి జొన్నకూటి విజయ మోహన్ కుమార్ , టీడీపీ కూచిపూడి ఉదయ భాస్కర్ రావు, కాంగ్రెస్ జే . సతీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.