Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా ‘శ్లాస్’ పరీక్షలు నిర్వహణ

-పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ విద్యా సంవత్సరం ముగింపు దశలో నాలుగో తరగతి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు తెలుసుకునేందుకు స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (శ్లాస్) పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్వహించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల యాజమాన్యాల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం అంశాలపై ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రమంతా ఎంపికచేసిన 3320 పాఠశాలల్లో 82 వేల మంది విద్యార్థులకు ఈ సర్వేను నిర్వహించామని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు 3400 మంది సీఆర్పీలను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను రూపొందిస్తాని తెలిపారు. మొదటిసారి శ్లాస్ 2022లో నిర్వహించామని, తర్వాత ఈ ఏడాది నిర్వహించామని తెలిపారు. శ్లాస్ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో అనేక విద్యా కార్యక్రమాలను రూపొందించి, ప్రాథమిక స్థాయి విద్యను మరింత నాణ్యవంతంగా అందించడానికి ‘తరల్’ వంటి కార్యక్రమాలను అమలుపరిచామని తెలిపారు.

విజయవాడలో పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ
ఈ సందర్భంగా విజయవాడ పట్టణం పటమటలంక వీఎంసీ పాఠశాలను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఎస్పీడీ తో పాటు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి  యు.వి.సుబ్బారావు, డీసీఈబీ (District Common Examination Board) సెక్రటరీ ఉమర్ అలీ, మండల విద్యాశాఖాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *