అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వితంతు వివాహాలతో మహిళాభ్యుదయానికై కృషిచేసిన మహనీయుడు “కందుకూరి వీరేశలింగం పంతులు” జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో వారి జన్మించిన వారి స్వగృహమును రాజమండ్రి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరి సందర్శించి వీరేశలింగం విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం మొట్టమొదట జరిపించిన వితంతు వివాహ వేదిక నమూనా వద్ద పురంధరేశ్వరి తమ కుటుంబ సమేతంగా ఫోటో తీసుకున్నారు. వీరేశలింగం గృహాన్ని ప్రభుత్వం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడున్న అధికారులను పురందరేశ్వరి అడిగి తెలుసుకొని, గృహాన్ని మరింత వృద్ధిపరిచి అందరికీ అందుబాటులో వీరేశలింగం నివాసగృహం ఉండే విధంగా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇంకా స్థానిక ప్రజలు, నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …