గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరిపైన అయినా క్రిమినల్ కేసులు నమోదు అయి ఉంటే వారు తగిన వివరాలతో న్యూస్ పేపర్, టెలివిజన్ లలో 3 దఫాలుగా ప్రకటనలు ఇవ్వాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పశ్చిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరిపైన అయినా క్రిమినల్ కేసులు నమోదు అయి ఉంటే వారు తగిన వివరాలతో న్యూస్ పేపర్, టెలివిజన్ లలో 3 దఫాలుగా ప్రకటనలు ఇవ్వాలని తెలిపారు. అభ్యర్ధులు తమ నామినేషన్ ఓకే అయిన తర్వాత ఉపసంహరణ గడువు ముగింపు అనంతరం పేపర్, టివి ల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్స్ కి ఒక్కరోజు ముందు అభ్యర్ధి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని తెలిపారు. నామినేషన్ ఫారాలతో పాటుగానే నిర్దేశిత డాక్యుమెంట్స్ జత చేయాలని, నామినేషన్ ఫారాలను పూర్తి చేసేప్పుడు ఏ సందేహాలు ఉన్నా జిఎంసిలోని హెల్ప్ డెస్క్ లను సంప్రదించవచ్చన్నారు. నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారీ కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందన్నారు. నామినేషన్ దాఖలు కు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని, నామినేషన్ వేసిన రోజు నుండే అభ్యర్ధి ఖర్చులు లెక్క వేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఏఆర్ఓ సునీల్, ఏఈఆర్ఓ ప్రదీప్ కుమార్, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ, కె.దివాకర్ రెడ్డి, డి.జానిబాబు (వైఎస్సార్సీపి), సిహెచ్.వాసు (బిఎస్పి), డి.బాలస్వామి , (కాంగ్రెస్) ఖాసిం షాహిద్ (సిపిఎం) పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …