గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబందించి ఈ నెల 18 నుండి నామినేషన్స్ స్వీకరణకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశామని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, 2024 సాదారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ మేరకు ఈ నెల 18 (గురువారం) నుండి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబందించి నామినేషన్ల స్వీకరణకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి కమిషనర్ చాంబర్ లో, పశ్చిమ నియోజకవర్గానికి సంబందించి సిటి ప్లానర్ చాంబర్ లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటారని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్ధులకు కమిషనర్ చాంబర్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో నామినేషన్ ఫారాలు అందించడం, ఫారాలు నింపే అంశాలు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్లను ఎన్నికల సంఘం షెడ్యుల్ మేరకు ఈ నెల 18 నుండి 25 వరకు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవడం జరుగుతుందని, సెలవు రోజుల్లో నామినేషన్లు తీసుకోబోమని తెలిపారు. నామినేషన్ ఫారాలు తీసుకునే సమయంలోనే ప్రతి ఒక్కరికీ చెక్ లిస్టు ఇస్తున్నామని, అందుకు తగిన విధంగా నామినేషన్ ఫారాలు పూర్తి చేసి ఇవ్వడం ద్వారా నామినేషన్లు రిజెక్ట్ కాకుండా ఉంటాయని తెలిపారు. 25 వ తేదీ వరకు అందిన నామినేషన్లను ఎన్నికల కమిషన్ నిర్దేశిత షెడ్యుల్ మేరకు 26వ తేదీ పరిశీలన చేస్తామని, 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. మే 13 న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …