గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2024-25) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి మొత్తం పన్ను పై లభించే 5 శాతం రాయితీకి 2 వారాలే గడువు ఉన్నందున, పన్ను చెల్లింపుదార్లకు వీలుగా నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా పని చేసేలా చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, రాయితీకి కేవలం 2 వారాలే గడవు ఉన్నదని తెలిపారు. రాయితీని పన్ను చెల్లింపుదార్లు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా సెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పన్ను చెల్లింపు కోసం జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పని చేసేలా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లో అదనపు క్యాష్ కౌంటర్లను కూడా క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆస్తి, ఖాళీ స్థల పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …