అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేసేందుకు రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ayushman bharat digital mission-ABDM) రాష్ట్ర నోడల్ అధికారి బీవీ రావు అన్నారు. ఎబిడిఎం, ఎన్ఐసి బృందాల సమన్వయంతో ఈనెల 15, 16 తేదీలలో హాయ్ లాండ్ థీమ్ పార్క్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డైరెక్టర్ ఆఫ్ సెకండరీ సర్వీసెస్ (డిఎస్ హెచ్) కింద పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌టెక్నీషియన్ల కోసం డిస్ట్రిక్ట్ మాస్టర్స్ ట్రైనింగ్ (టిఓటి) కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. రెండో రోజు శిక్షణలో భాగంగా మంగళవారం జిల్లాల మాస్టర్ ట్రైనీలనుద్దేశించి బీవీ రావు మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ(Health Professional Registry-HPR) జరుగుతోందన్నారు. రాష్ట్ర జనాభాలో 4.13 కోట్ల(80 శాతం) ఆయుష్మాన్ భారత్ హెల్త్ అక్కౌంట్లు(Ayushman bharat health accounts-,ABHAs) క్రియేట్ చేశామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ కృష్ణ బాబు ప్రోత్సాహంతో ఈ స్థాయిలో చేయగలిగామని ఈ సందర్భంగా బీవీ రావు పేర్కొన్నారు.
ప్రజారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే విషయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముందడుగు వేసిందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో ఏపీ గణనీయమైన విజయాన్ని సాధించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థలలో ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ చేయడంలో ఏపీ దూసుకెళ్తోందన్నా. హెల్త్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల(EHR) కోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ -HMIS (ఈ-హాస్పిటల్ eHospital, నెక్స్ట్ జెన్ ఈ-హాస్పిటల్ nextgen eHospital) ఉపయోగిస్తున్నామన్నారు. ఎన్ హెచ్ ఎం రాష్ట్ర మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇ-హెచ్ ఆర్ కార్యక్రమాల్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎబిడిఎం అమలు తీరును ఆయన ఈ సందర్భంగా మాస్టర్ ట్రచనర్లకు వివరించారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం క్షేత్ర స్థాయిలో శిక్షణను అందించడానికి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించానీ , ఇక్కడ శిక్షణ పొందిన జిల్లా మాస్టర్ ట్రైనర్లు తమతమ జిల్లాల్లో సమర్ధవంతంగా శిక్షణ ఇవ్వాలనీ ఆయన కోరారు. రాష్ట్ర కేంద్ర నుండి ఎలాంటి సాంకేతిక సాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎబిడిఎం ను రాష్ట్రంలో విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రచనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. వారివారి సమర్ధతను బట్టి ఎబిడిఎం నగదు ప్రోత్సాహకాల్ని అందిస్తోందనీ , నెలనెలా నగదు అకౌంట్ లలోకి రావాలంటే ఆన్ లైన్లో ఎటువంటి లోపాలూ లేకుండా చూసుకోవాలన్నారు.
సెకండరీ హెల్త్ ఏబీడీఎం నోడల్ అధికారి నాగలక్ష్మి, ఎన్ఐసి నిపుణులు, ఏబీడీఎం ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …