Breaking News

భారత ఎన్నికల కమిషన్ కు సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటి వారు…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా స్వేచ్చగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిథిగా ఉంటారని, తమపై గురుతర బాధ్యత ఉందని, ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులు అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియం నందు సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులుగా నియామకం చేయబడిన వారికి ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్ లుగా మొత్తం కలిపి 1200 మందికి వారి బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ … సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా స్వేచ్చగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిథిగా ఉంటారని, తమపై ఎంతో గురుతర బాధ్యత ఉందని, ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులు అని అన్నారు.

సూక్ష్మ పరిశీలకులుగా విధులు కేటాయించబడిన వారు తప్పక శిక్షణకు హాజరు కావాలని, గత ఎన్నికలలో పని చేసి ఉంటే ఆ అనుభవం ఈ విధులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న మనం అందరూ భారత ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని స్పష్టం చేశారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుంది అని అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో జరిగే ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గల ఒక్కో పోలింగ్ స్థానానికి ఒక సూక్ష్మ పరిశీలకులు నియమించబడతారని తెలిపారు. మే13 న పోలింగ్ డే అని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేశామని తెలిపారు. ఏదేని ఎన్నికల ప్రక్రియ లో ఇబ్బందులు, సమస్యలు ఉంటే వాటిని సంబంధిత సెక్టరియల్ అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సాధారణ ఎన్నికల అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. సార్వత్రిక ఎన్నికలు లోక్ సభ, శాసనసభ కు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవిఎం లు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వివిప్యాట్ లు రెండు సెట్లు ఉంటాయని ఒకటి లోక్ సభ, మరొకటి శాసనసభ పోలింగ్ కొరకు ఏర్పాటు ఉంటుందని, మాక్ పోల్ ఉదయం 5.30 కి పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో ఉంటుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గం. ల నుండి సాయంత్రం 6 గం. ల వరకు ఉంటుందని, వీడియోగ్రఫీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటుతో సీక్రెట్ గా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ రిపోర్ట్ పంపవలసి ఉంటుందని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు క్లోజింగ్ ఆఫ్ ఈవిఎం సక్రమంగా చేపట్టాల్సి ఉంటుంది అని, సీల్, ట్యాగ్ పక్కాగా ఉండాలని అన్నారు. పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గం. లకు క్యూ లో ఉన్నవారికి స్లిప్పులు అందచేసి వారు అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్తగా ఓటింగ్ వేయడానికి సాయంత్రం 6 గం.లకు పైన వచ్చే వారిని ఎవరిని అనుమతించరాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల విధులకు హాజరు అయ్యే పోలింగ్ సిబ్బందికి వారి సంక్షేమం కొరకు ప్రత్యేకంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నియమించామని ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భారత ఎన్నికల కమిషన్ వారికి ఎన్నికల సాధారణ పరిశీలకుల ద్వారా సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటి వారని, ఎంతో గురుతర బాధ్యత ఉందని, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులలో ఉండి జిల్లాలో ఓటరుగా నమోదు ఉన్న వారు ఫారం 12 నందు వివరాలు నమోదు చేసి తమ పోస్టల్ బ్యాలెట్ ను సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని, సంబంధిత నియోజక వర్గంలో వారు తమ ఓటు వేసేందుకు పోలింగ్ రోజుకు వారం ముందు రిటర్నింగ్ అధికారి సూచించిన తేదీన, నిర్దేశిత ప్రదేశంలో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ నందు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పంపడం జరగదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల శిక్షకులు రామ్మోహన్, చెన్నయ్య, వివిధ బ్యాంకుల, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *