విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమం జరిగింది. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని మలేరియా సబ్ యూనిట్-5 విభాగము నందు గల బావాజీపేట ఒకటో లైన్, పరిసర ప్రాంతాలలో ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, అసిస్టెంట్ మలేరియా అధికారి సూర్య నాయక్ మరియు సబ్ యూనిట్ అధికారి కె.రాజంరాజులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ నందు చెత్తాచెదారంలను నిర్మూలించి చుట్టుపక్కల ప్రజలకు ‘ఫ్రైడే డ్రై డే’ యొక్క ఆవశ్యకతను, దోమల ద్వారా వచ్చు వ్యాధుల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత పై మరియు వడదెబ్బ నుండి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కాల్వలు శుభ్రంగా పారేవిధంగా చెత్తను తొలగించి కాలువ, డ్రైనేజీ నందు ఎంఎల్ ఆయిల్ పిచికారీ చేశారు. అనంతరం స్థానికులకు చెత్తను డస్ట్‌బిన్‌లో వేయాలని, కాల్వలో వేసే ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ వేయవద్దని ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టే విషయంలో నగరపాలక సంస్థ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ నుండి హెల్త్ సూపర్‌వైజర్లు బి.ఇ. పాలరీస్, పి.నీరజకుమారి, బి.ఎస్.ఎన్.రెడ్డి మరియు మలేరియా సిబ్బంది పి.బి.శ్రీనివాస్‌కుమార్, రమేష్, శానిటేషన్ సెక్రటరీ పావనీ, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సిబ్బంది ఎల్లారావు, హెల్త్ అసిస్టెంట్లు, ఉమెన్ హెల్త్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు మరియు ఆశాలు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.