Breaking News

చైత్ర మాస బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవస్థానం నందు స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర శుద్ధ చతుర్ధశి తత్కాల పౌర్ణమి వరకు అనగా ది.19.04.2024, శుక్రవారం నుండి ది27.04.2024, శుక్రవారము వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములను ఆగమోక్తముగా అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు, అందులో భాగముగా సదరు బ్రహ్మోత్సవ రోజులలో రోజుకొక వాహనముపై శ్రీ స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వాహనసేవ (నగరోత్సవము), కళ్యాణము రోజున సుప్రసిద్ధ కవులచే రాయబారం మరియు ది.25.04.2024 నుండి ది.27.04.2024 వరకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు తదితర కార్యక్రమములు నిర్వహించుటకు వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయించడమైనది.

కార్యక్రమముల వివరములు
ది.19.04.2024, శుక్రవారం : ఉ.గం.09-30 ని.లకు శ్రీ దుర్గామల్లేశ్వరులకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరించుట. (శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునందు)
సా. గం.04-00ని.లకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ,అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం.
ది.20.04.2024, శుక్రవారం : ఉ. గం.08-00 ని.లకు మూల మంత్ర హవనములు
నుండి
ది.24.04.2024, అదివారం సా. నుండి గం.05-00ల నుండి గం. 06-00ల వరకు ఔపాసన,
ఉదయం వరకు బలిహరణ. తదుపరి హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ.

ది.22.04.2024, సోమవారం : రా. గం.08-00ల నుండి గం. 09-30ని.ల వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద “రాయబారము” (ఎదుర్కోలు ఉత్సవము). ప్రముఖ కవి పండితులచే కళ్యాణ వైశిష్టము తెలియజేయుట.

రా.గం.10-30 ని.లకు “శ్రీ దుర్గామల్లేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవము” అత్యంత వైభవోపేతముగా జరుగును.

ది.23.04.2024, మంగళ వారం: ఉ. గం.09-00ని.లకు సదస్యము,వేద స్వస్తి, వేదపండితుల వేదాశీస్సులు
ది.24.04.2024,బుధవారం : ఉ.గం.10-00లకు “పూర్ణాహుతి”, ధాన్యకోట్నోత్సవము, వసంతోత్సవము,
అవభృత స్నానము, మూకబలి, ధ్వజావరోహణం, బ్రహ్మోత్సవములు సమాప్తి. సా. గం.04-00 ని.ల నందు- శ్రీ గంగా పర్వతి సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లకు ప్రవిత్ర కృష్ణ నది హంస వాహన తేపోతనము.(శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నందు ఉతవాము ప్రారంభము
ది.25.04.2024, గురువారం : సా. గం.04-30 ని.ల నుండి – సాంస్కృతిక కార్యక్రమములు
రాత్రి గం. 07-30 ని.ల నుండి – ద్వాదశ ప్రదక్షిణలు
రా. గం. 08-30 ని.లకు – పవళింపు సేవ -పుష్ప యాగశయనోత్సవము
ది. 26.04.2024, శుక్రవారం : రా. గం. 09-00లకు – పవళింపు సేవ (ఏకాంత సేవ)
& ది.27.04.2024, శనివారం
వాహన సేవలు
ది.19.04.2024 సా. గం. 05-00లకు – వెండి పల్లకీ సేవ
ది.20.04.2024 సా. గం. 05-00లకు – రావణ వాహన సేవ
ది.21.04.2024 సా. గం. 05-00లకు – వెండి రధోత్సవము
ది.22.04.2024 సా. గం. 05-00లకు – నంది వాహన సేవ
ది.23.04.2024 సా. గం. 05-00లకు – సింహ వాహన సేవ

వాహన సేవల (నగరోత్సవం) యొక్క రూట్ వివరములు:
ది.19.04.2024 : వెండి పల్లకీ పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణ వీధి, కోమలావిలాస్ సెంటర్, సామారంగం చౌక్, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.20.04.2024 : రావణ వాహనముపై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.21.04.2024 : వెండి రధము పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.22.04.2024 : నంది వాహనముపై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణవీధి, శ్రీనివాసమహల్, కోమలా విలాస్ సెంటర్, సామారంగం చౌక్, మెయిన్ రోడ్, ఐరన్ సెంటర్, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.23.04.2024 : సింహ వాహనము పై సాయంత్రం గం.05-00లకు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, కుమ్మరిపాలెం సెంటర్, కామకోఠి నగర్, శంకరమఠం, సితార సెంటర్, సొరంగం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా మహా మండపమునకు చేరును.
ది.24.04.2024 : సాయంత్రం గం.04-00లకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద ఉత్యవముగా బయలుదేరి కనకదుర్గా నగర్ మీదుగా దుర్గా స్వాన ఘాట్ నకు చేరుకొని అనంతరం శ్రీ గంగా పర్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణా నది యందు హంస వాహన తెప్పోత్సవము నిర్వహించబడును.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *