-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి జిల్లాలో మూడవ రోజు 20 నామినేషన్లు దాఖలైనాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 11.00 గంటలకు ప్రారంభయిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3.00 గంటల వరకు కొనసాగిందన్నారు. నియోజకవర్గాల వారీగా మూడవ రోజు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వివరాలను వెల్లడించారు.
దాఖలైన నామినేషన్ల వివరాలు:
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం (23-SC)
1.వి.సి. నవీన్ గుప్తా వెలగపల్లి (ఇండిపెండెంట్)
2. వి.సి. నవీన్ గుప్తా వెలగపల్లి (భారతీయ జనతా పార్టీ )
3. గుర్రప్ప పెనుమూరు (బహుజన సమాజ్ పార్టీ)
120- గూడూరు SC
1.అన్నెం మల్లికార్జున ( బహుజన సమాజ్ పార్టీ)
121 సూళ్ళూరుపేట (SC)
1.బురకాల లీలా మోహన్ (ఇండిపెండెంట్)
122 వెంకటగిరి
ఏ నామినేషన్ లు దాఖలు కాలేదు.
166 చంద్రగిరి
1. సి. శ్రీ చరణ్ (ఇండిపెండెంట్)
167 తిరుపతి
1.పి. మురళి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా)
2. ఎం. నీలకంఠ (జై హిందూస్థాన్)
3.ఆర్. కృష్ణ చైతన్య (ఇండిపెండెంట్)
4.పెంచల ప్రసాద్ వసిలి (ఇండిపెండెంట్)
5.కె. భార్గవ్ (ఇండిపెండెంట్)
6.పాపిరెడ్డి గారి సోమశేఖర్ రెడ్డి (ఇండిపెండెంట్)
7.సోడిశెట్టి నరేశ్ (ఇండిపెండెంట్)
8.నెల్లేపల్లి బెనర్జీ (ఇండిపెండెంట్)
9. పి. సాయి ప్రసన్న కుమార్ (ఇండిపెండెంట్)
168 శ్రీకాళహస్తి
1. తీగల భాస్కర్ (స్వతంత్ర అభ్యర్థి)
2. బియ్యపు మధుసూదన్ రెడ్డి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)
3. బియ్యపు శ్రీవాణి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)
4. పి. రాజేష్ నాయుడు (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ)
169 సత్యవేడు (SC)
1. హెచ్ . హేమలత ( తెలుగు దేశం పార్టీ)
జిల్లా కేంద్రంలోని తిరుపతి పార్లమెంటుతో పాటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు నామినేషన్స్ వెరిఫికేషన్ కౌంటర్, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్ లో అన్ని సదుపాయాలను సంబంధిత ఎన్నికల అధికారులు కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆర్వో కార్యాలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.