రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేశారు.
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సమయం నుంచి నిఘా పెట్టడం జరిగిందనీ, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత దిశా నిర్దేశనం మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఎన్నికలలో పోటి చేసేందుకు అభ్యర్దులు నామినేషన్ లని వెయ్యడం జరిగిందనీ , రానున్న మూడు నాలుగు రోజులలో ఇంకా ఎక్కువ స్థాయిలోఅగ్రస్థానంలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా
ఆమేరకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్దులు నామినేషన్ దాఖలు చేసే క్రమంలో నిర్వహిస్తున్న ర్యాలీల విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పోటిలో నిలిచే అభ్యర్థులు కు ఖర్చులకి సంబందించి వివరాలు నమోదు చేసేందుకు, నామినెషన్ దాఖలు చేసిన సమయంలో అకౌంట్స్ బుక్స్ ఇస్తున్నట్లు తెలియ చేశారు.