విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయితో కొట్టిన సంఘటనపై ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలకడలేని ఆరోపణలు చేయడం తగదని సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ ఖండించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలి గోవింద్ మాట్లాడుతూ గతంలో కోడికత్తి సంఘటనతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు గులకరాయి సంఘటనతో సానుభూతితో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని నోటి కొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. అన్నాక్యాంటీన్ కోసమని కాసేపు ప్రచారానికి పిలిచి డబ్బులు ఇవ్వలేదని కాసేపు ఇలా రకరకాలుగా ఆరోపణలు చేయడం ప్రజలు అందరూ చూస్తున్నారని, మళ్ళీ తనను అరెస్టు చేస్తున్నారని సానుభూతిని ప్రజలలో తీసుకువెళదామని చూస్తున్న మీరు అదే ఏ ప్రమాదమైన సీఎం జగన్‌కు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చట్టం అనేది ఒకటి వుంది అది తనపని అది చేసుకుంటుంది ఇప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. తనను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారనడం సబబుకాదన్నారు. ప్రజల దగ్గరకు వెళ్ళండి వైసీపీ ప్రభుత్వం కంటే ఇంకా మంచి చేస్తామని ఆలోచనను ముందు తీసుకువెళ్ళండి దానిని ప్రజలు నమ్ముతారు తప్పితే సానుభూతి కోసం చేసే పనులు ఎవ్వరూ నమ్మరన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …