విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రాషిర్డీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మరకత శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో శనివారం మరకత శివలింగ వాయుప్రతిష్ట కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా మందిరంలో మరకత శివలింగ వాయు ప్రతిష్ట చేస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు గోపూజతో ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఆలయ ప్రదక్షిణ, అధిష్టాన దేవతల అనుజ్ఞ, శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన, దీక్షావస్త్రధారణ, కలశస్థాపనలు, మూమంత్ర హోమాలు జరుగుతాయన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సాయం కాల మండప పూజలు, విగ్రహాలకు జలాధివాసం చేస్తామన్నారు. 23న మంగళవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు, హోమాలు జరుగుతాయన్నారు. 24న బుధవారం ఉదయం 10.43 గంట లకు రత్న ధాతు, దాన్య యంత్ర సహిత శివలింగ ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ఈ విశేష మరకత శివలింగంకు భక్తులు ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చ ని, సాయంత్రం అలంకరణ, అర్చనలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. లోక కల్యాణార్థం తాము తలపెట్టిన మరకత శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ దొంతిరెడ్డి లక్ష్మణరెడ్డి, ఆలయకమిటీ కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, పీ శ్రీనివాస రావు, సైదులు, లఖంరాజు సునీత తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …