-మొబైల్ కోర్టులో నమోదయిన 35 కేసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 2 కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్టులో 35 కేసులు నమోదు అయ్యాయి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి బి.విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం రోడ్డుపైన చెత్త వేసినందుకు, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టినందుకు సర్కిల్-2 పరిధిలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 35 కేసులపై విచారణ జరిపి రూ.17010. జరిమానా విధించారు. ఒకసారి జరిమానా విధించాక రెండోసారి కూడా ఆ తప్పు చేస్తే కఠినంగా చర్యలు తీసుకొని లైసెన్స్ కూడా రద్దు చేస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు అంతేకాకుండా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ రోడ్లపై చెత్త వేసిన, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్-2 డాక్టర్ వి రామ కోటేశ్వరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఇతర శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సెక్రటరీలు పాల్గొన్నారు.