విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుని ఆకాంక్షిస్తూ అతని సోదరి దేవినికి క్రాంతి 13వ డివిజన్ పాలకేంద్రం స్ట్రీట్,కోనేరు స్ట్రీట్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిశారు.. వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఆమె ఓట్లు అభ్యర్థించారు.. కష్టపడి పనిచేసే అవినాష్ నీ గెలిపించాలని ఆమె కోరారు.. జగన్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు.. నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలంటే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని కి, తూర్పులో అవినాష్ కి రాష్ట్రంలో జగన్ గెలవాలని ఆమె అన్నారు.. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ఇంచార్జ్ రమాయణపు శ్రీనివాస్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …