– స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలోని తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ అబ్జర్వర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి మంజూ రాజ్‌పాల్ మంగళవారం విజయవాడ నగరానికి విచ్చేశారు. స్థానిక మునిసిపల్ గెస్ట్ హౌస్ వద్ద మంజూ రాజ్‌పాల్‌కు కలెక్టర్ ఎస్.డిల్లీరావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కేంద్రం కార్యకలాపాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్, పీవో, ఏపీవోల శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వివిధ ఫారాల పరిష్కారం, ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) తదితరాల గురించి వివరించారు. అదే విధంగా వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం గురించి వివరించారు. జనరల్ అబ్జర్వర్‌కు స్వాగతం పలికిన వారిలో జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, కేఆర్ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, విజయవాడ పశ్చిమ ఆర్‌వో ఇ.కిరణ్మయి తదితరులు ఉన్నారు.