అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎంతో లింక్ చేయడంవల్ల అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం ఏపీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఐఎఎస్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చినకాకాని హాయ్ ల్యాండ్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్(ABDM) ఆరు రోజుల పాటు నిర్వహించిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం గురువారం నాడు ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాస్టర్ ట్రైనర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు డిజిటలైజేషన్ వైపు పరుగులతీస్తున్న ప్రస్తుత తరుణంలో మనం కూడా ఆ దిశగా పయనించాల్సిన అవసరముందన్నారు.
వందకు వంద శాతం ఆన్లైన్ విధానంలోకి వెళ్లాలన్నారు. దేశమతంతా డిజిటల్ యుగం వైపు చూస్తోందన్నారు. దక్షిణ ఆసియా దేశాలు డిజిటలైజేషన్ లో పూర్తి సామర్థ్యాన్ని ఏర్పరుచుకున్నాయన్నారు. ఎబిడిఎం పై ప్రతి రెండు వారాలకోసారి సమీక్షిస్తానన్నారు. స్టేట్ నోడల్ ఆఫీసర్ బీవీ రావు నేతృత్వంలో ఎబిడిఎం బృందం సమర్ధవంతంగా పనిచేస్తోందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. రోగుల డిజిటల్ వివరాల్ని ఏకీకరణ చేయాలన్నారు. తద్వారా పరీక్షించే డాక్టర్లకు సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.
ఎబిడిఎం, ఎన్ఐసి సమన్వయంతో ఈనెల 15, 16 తేదీలలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్(గతంలో ఎపివివిపి) పరిథిలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు , ల్యాబ్ టెక్నీషియన్లకు డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్లుగా రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈనెల 22 నుండి నాలుగు రోజుల పాటు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోని జిజిహెచ్ లు , టీచింగ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు , ల్యాబ్ టెక్నీషియన్లకు డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్లుగా రెండు రోజుల శిక్షణను రెండు బ్యాచ్ లుగా విభజించి నాలుగు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారం నాడు ముగిసింది.
ప్రజారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే విషయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముందుందని కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో ఏపీ గణనీయమైన విజయాన్ని సాధించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థలలో ఆరోగ్య రికార్డుల డిజిటలైజ్ చేయడంలో ఏపీ దూసుకెళ్తోందన్నా. హెల్త్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల(EHR) కోసం ఈ-హాస్పిటల్ (eHospital), నెక్స్ట్ జెన్ ఈ-హాస్పిటల్ (nextgen eHospital) సాఫ్ట్ వేర్ తో కూడిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) వినియోగిస్తున్నామన్నారు.
ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు తమతమ జిల్లాల్లో సమర్ధవంతంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎబిడిఎంను రాష్ట్రంలో విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. ఎబిడిఎం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ బొడ్డేపల్లి వెంకటేశ్వరరావు, నోడల్ ఆఫీసర్(డిఎంఇ) ప్రేమ్ నిస్సీ , ఎబిడిఎం పీఓ డాక్టర్ నరేష్, ఎన్ఐసి రోలవుట్ మేనేజర్లు, ఏబీడీఎం ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …