-స్ధానిక కాటన్ గెస్ట్ హౌస్ నందు పరిశీలకులు బస ఏర్పాటు
-ప్రజలకి అందుబాటులో ఉంటామని తెలియ చేసిన సాధారణ పరిశీలకులు
-కలెక్టర్ , డి ఈ వో డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పరిశీలకులు రావడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో పరిశీలన కోసం రాజమండ్రి పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాలకు సాధారణ పరిశీలకులు, ముగ్గురు వ్యయ పరిశీలకులు, ఒక పోలీసు పరిశీలకులు రావడం జరిగిందనీ పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులకు స్థానికంగా ధవళేశ్వరం లోని కాటన్ గెస్ట్ హౌస్ నందు విడిది ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సాధారణ పరిశీలకులు ప్రజల నుంచి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాటన్ గెస్ట్ హౌస్ నందు అందుబాటులో ఉండడం జరుగుతుందనీ ఆమేరకు సంభందిత వివరాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాకు వచ్చిన పరిశీలకులు :
“సాధారణ పరిశీలకులు”
సాధారణ పరిశీలకులు కే. బాల సుబ్రమణ్యం , ఐ.ఎ.ఎస్.,
ఏ నియోజక వర్గాలకు …
-08 – రాజమండ్రీ పార్లమెంటు,
40 అనపర్తి అసెంబ్లీ,
49 రాజానగరం అసెంబ్లీ ,
50 రాజమండ్రీ సీటి అసెంబ్లీ ,
51 రాజమండ్రీ రూరల్ అసెంబ్లీ.
** అందుబాటులొ ఉండే సమయం సా 4 నుంచి 5 వరకు
** సంప్రదించ వలసిన ఫోన్ నంబర్ 8977935105
సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్, ఐ.ఎ.ఎస్.,
54 కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ ,
55 నిడదవోలు అసెంబ్లీ ,
66 ఎస్సీ గోపాలపురం అసెంబ్లి
** అందుబాటులొ ఉండే సమయం ఉదయం 9.00 నుంచి ఉ.10 వరకు
** సంప్రదించ వలసిన ఫోన్ నంబర్ 8977935105
” వ్యయ పరిశీలకులు ”
రాజమండ్రీ పార్లమెంటు నియోజక వర్గ వ్యయ పరిశీలకుల జై అరవింద్ , ఐ.ఆర్.ఎస్., ఫోన్ నంబర్ 8977935072
అసెంబ్లి నియోజక వర్గ వ్యయ పరిశీలకులు నితిన్ కురాయన్ , ఐ.ఆర్.ఎస్., ఫోన్ నంబర్ 8977935073
అసెంబ్లి నియోజక వర్గ వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ , ఐ.ఆర్.ఎస్., ఫోన్ నంబర్ 8977935074
పోలీసు పరిశీలకులు
బలరాం మీనా, ఐ.పి.ఎస్., ఫోన్ నంబర్
8712602093