– అతిథిగృహాల్లో నిర్దిష్ట సమయాల్లో కలిసేందుకు అవకాశం
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల నేపథ్యంలో సీ-విజిల్ తదితర మార్గాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించడం జరుగుతోందని.. అదే విధంగా జిల్లా ఎన్నికల పరిశీలకులను నిర్దిష్ట సమయాల్లో నేరుగా కలిసి ఆయా అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు, ఫిర్యాదులు అందించవచ్చని, అదే విధంగా విషయ తీవ్రతనుబట్టి ఫోన్ నంబర్లలోనూ సంప్రదించొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూ రాజ్‌పాల్… అదే విధంగా మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నరీందర్ సింగ్ బాలి జనరల్ అబ్జర్వర్‌గా వచ్చినట్లు వెల్లడించారు. ఈ సాధారణ పరిశీలకులు పోలింగ్ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మునిసిపల్ గెస్ట్ హౌస్, నందమూరి రోడ్డు, బృందావన్ కాలనీ, లబ్బీపేట, విజయవాడలో అందుబాటులో ఉంటారని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు, విజ్ఞాపనలు సమర్పించవచ్చన్నారు. అదే విధంగా మంజూ రాజ్‌పాల్ 81215 26777 నంబర్లోనూ, నరీందర్ సింగ్ బాలి 91548 83009 నంబర్లోనూ అందుబాటులో ఉంటారని, విషయ తీవ్రతను బట్టి ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపారు.
– విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ ప్రీతీందర్ సింగ్ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పోలీస్ గెస్ట్ హౌస్, నియర్ అమెరికన్ హాస్పిటల్ ట్రాఫిక్ జంక్షన్, బందర్‌రోడ్డు, విజయవాడలో అందుబాటులో ఉంటారని.. అదే విధంగా 91548 83014 నంబర్‌లో సంప్రదించవచ్చని వివరించారు.
– విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్; తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ; విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు మదన్ కుమార్ మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఎదురుగా, బందర్ రోడ్డు, విజయవాడలో అందుబాటులో ఉంటారన్నారు. అదే విధంగా వి.జస్టిన్ 81214 90777 నంబర్లోనూ, సౌరభ్ శర్మ 81214 05777, మదన్ కుమార్ 91548 83050 నంబర్లోనూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
– ఎన్నికల పరిశీలకులు క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తారని.. ఆ సమయాల్లోనూ ప్రజలు నేరుగా కలిసి తమ ప్రాధాన్య అంశాలను తెలియజేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు వివరించారు.