విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నరీందర్ సింగ్ బాలి గురువారం మూడు నియోజకవర్గాల పరిధిలో పర్యటించి ఆర్వో కార్యాలయాల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలో స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మైలవరం లక్కిరెడ్డి లక్ష్మీ రెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఈవీఎం, వీవీప్యాట్ స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. నందిగామలోని కేవీర్కాలేజీ, జగ్గయ్యపేట జిల్లా పరిషత్ హైస్కూల్ లోని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …