విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీ,జనసేన నాయకులు ఆయా పార్టీలను వదలి వైసీపీ లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలతో ఆ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయమని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు . శుక్రవారం 16వ డివిజన్ కు చెందిన జనసేన యువ నాయకులు చెన్నంశెట్టి చైతన్య నాయకత్వంలో దాదాపు 100 మంది యువకులు,మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంకు మద్దతు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేయడానికి ముందుకు రాగా వారందరికి అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమలతో ప్రజల్లో తిరుగులేని ఆదరణ లభిస్తోంది అని, ప్రతిపక్ష పార్టీల సభలకు, ర్యాలీ లకు జనాలు రాక పక్క నియోజకవర్గల నుండి డబ్బులిచ్చి మరి తరలించే పరిస్థితి ఏర్పడింది అని ఎద్దేవా చేశారు. ఇటీవల క్రిష్ణలంక, పటమాట ప్రాంతాల నుండి కూడా ప్రతిపక్ష పార్టీలలో గౌర్వపదమైన పదవులలో ఉన్న నాయకులు కూడా వైసీపీ పార్టీలో చేరడం తో మా బలం మరింత పెరిగిందని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, కొత్తపాత నాయకుల సమన్వయం తో ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, వైసిపి నాయకులు బొడ్డు అప్పుల నాయుడు,గుమ్మడి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …