గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు ఈవిఎంల వినియోగంపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఇంజినీరింగ్ అధికారులకు ఎన్నికల ప్రాసెస్, ఈవిఎంల నిర్వహణపై డెమో ఈవిఎంల ద్వారా శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవిఎంలు, వివి ప్యాట్ ల పని తీరుపై ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రధానంగా ఈవిఎంలు, వివి ప్యాట్లు కమిషనింగ్, పోల్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం చేసేలా సిద్ధమవ్వలన్నారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు తప్పనిసరిగా ఎన్నికల ప్రాసెస్ పై అవగాహన కల్గి ఉండాలని, ఎన్నికల రోజు ఈవిఎంల్లో ఏ సమస్య ఎదురైనా తక్షణం పరిష్కారం చేసేలా శిక్షణ పొందాలన్నారు. శిక్షణలో ఏఆర్ఓ సునీల్ కుమార్, ఈఈ సుందర్రామిరెడ్డి, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …