రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం పార్లమెంటు నియోజక వర్గ సాధారణ పరిశీలకులు కే . బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం సువిధ, సి విజిల్, ఎమ్ సి సి, మీడియా సెల్, మీడియా మోనటరింగ్ సెల్, 1950 కాల్ సెంటర్, ఎన్ వి ఎస్ పి విభాగం, చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ ల విభాగాలను పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సువిధా ద్వారా అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా, నేరుగా వొచ్చిన దరఖాస్తులు వివరాలు తెలుసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులకీ సంబందించి నేరుగా ఆయా అభ్యర్ధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా ప్రతులను అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. సి విజిల్ కి వస్తున్న ఫిర్యాదులను 33 నిమిషాలలోగా పరిష్కారము చేయటం జరుగుతున్నట్లు తెలిపారు. ఎమ్ సి సి ఉల్లంఘనలకు సంబంధిత నియోజక వర్గాల వారీగా రికార్డులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు సంభందిత రిటర్నింగ్ అధికారులు ద్వారా నోటీసు అంద చేస్తున్నట్లు తెలిపారు.
మీడియా మానిటరింగ్ విభాగంలో 16 న్యూస్ ఛానళ్ల ద్వారా జిల్లాకి చెందిన ప్రతికూల, అనుకూల వార్తలను మూడు షీట్ లలో సిబ్బందిని నియమించి పర్యవేక్షణా చేస్తున్నట్లు తెలిపారు. ఆయా వివరాలను రిజిస్టర్ లలో టైం లతో కూడి నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. అనుకూల , ప్రతికూల, చెల్లింపు వార్తలను గుర్తించి ఆయా రిటర్నింగ్ అధికారులు ద్వారా అభ్యర్థులకు తెలియ చెయ్యడం జరుగుతోందని డి పి ఆర్వో కాశయ్యా వివరించారు.
ఈ సందర్శన లో జిల్లా రెవిన్యూ అధికారి జి..నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్. కృష్ణ నాయక్, డి పి ఆర్వో ఐ. కాశయ్య, రూడా విసి బీ. బాల స్వామీ, మార్కెటింగ్ ఏ డీ ఎమ్. సునీల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.