-ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రత పింఛన్లు మే నెలలో పంపిణీ బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా ఖాతాల్లో జమ, బ్యాంకు ఖాతా లేని వారికి, డిబిటి ఫెయిల్ అయిన వారికి గ్రామ వార్డు సచివాలయం అధికారులచే వారి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీకి చర్యలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రత పింఛన్లు మే నెలలో పంపిణీ చేయునవి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి వారి ఖాతాలోకి నేరుగా మే ఒకటో తారీఖున జమ చేయడం జరుగుతుందని, బ్యాంకు ఖాతా లేని వారికి, డిబిటి ఫెయిల్ అయిన వారికి వారి ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా మే ఒకటో తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవ్వరూ సచివాలయానికి పింఛన్ల కొరకు వ్యయ ప్రయాసలకోర్చి రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వారి కొరకు, డిబిటి ట్రాన్సక్షన్ ఫెయిల్ అయిన వారి కొరకు సంబంధిత ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లు సదరు బ్యాంకుల నుండి పెన్షన్ నగదును ఈ నెల ఏప్రిల్ 30 తేదీననే విత్ డ్రా చేసి సిద్ధంగా అందుబాటులో ఉంచుకుని నిబంధనల మేరకు పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు.
మే నెల ఒకటో తేదీ నుండి మూడు తారీఖు సాయంత్రం లోపు మే నెలకు అందాల్సిన పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 100% పింఛన్ల పంపిణీ మూడు రోజుల్లోపు పూర్తి చేస్తామని వారు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.