గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్క్రూట్ని అనంతరం ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్నారని, 28 మంది అభ్యర్ధులు తుది పోటీలో ఉన్నారని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ సమయం అనంతరం తుది అభ్యర్ధులు, పోలింగ్ ఏజంట్లతో ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు గుర్తుల కేటాయింపు, ప్రవర్తణావలి, ఖర్చుల నమోదు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ముగ్గురు అభ్యర్ధులు నూనె పవన్ తేజ నాయుడు (ఇండిపెండెంట్), స్పూర్తి విడదల (ఇండిపెండెంట్), సైరాబాను (ఇండిపెండెంట్) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, మే 13 జరిగే ఎన్నికల్లో 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉంటారని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్ధులకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్ధుల సమక్షంలోనే గుర్తులు కేటాయింపుని చేసామని, ఒక గుర్తుని ఒక్కరికంటే అదనంగా అడిగినవాటికి లాటరీ ద్వారా కేటాయింపు చేయుట జరిగిందని తెలిపారు.
సమావేశంలో ఏఆర్ఓలు సీనారెడ్డి, సి.హెచ్ శ్రీనివాసరావు, సూపరిండెంట్ సాంబశివరావు, అభ్యర్ధులు, పోలింగ్ ఏజంట్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …