-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన పి.ఓ మరియు ఎపీఓ లకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పి.ఓ, ఎపిఓ లకు ఏ నియోజక వర్గానికి కేటాయించబడిన వారు ఆ నియోజక వర్గంలో శిక్షణ కొరకు రేపు మే2 గురువారం నాడు తప్పక హాజరు కావాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పీ. ఓ, ఎపీఓ లకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయి రేపు మధ్యాహ్నం నాటికి పిసి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయికి సంబంధించి సంబంధిత నియోజక వర్గాలకు పంపడం జరుగుతుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల మేరకు తిరుపతి, చంద్రగిరి, తిరుపతి పిసి కి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు అదనంగా కావలసి ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంకు సరిపడా రిజర్వ్ నుండి పంపడం జరిగిందనీ, చంద్రగిరి ఏ.సి, తిరుపతి పిసి వరకు అవసరమైన బ్యాలెట్ యూనిట్లను బెల్ నుండి రేపు చేరుకోనున్నాయని, ఎఫ్ఎల్సి 3,4 మే రోజున పూర్తి అవుతుందని, తదుపరి అసెంబ్లి ఈవిఎం కమిషనింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. బెల్ ఇంజినీర్లు 21 మంది జిల్లాకు చేరుకున్నారని, 7A మన జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోనూ పూర్తి అయిందని తెలిపారు. అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులకు మే 5,6 తేదీన పోస్టల్ బ్యాలెట్ నిర్దేశిత ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉంటుందని తెలిపారు. పిసి ఈవిఎం ల కమిషనింగ్ సప్లిమెంటరీ రాండమైజేషన్ జరిపి పంపడం జరుగుతుందని తెలిపారు.
పి. ఓ , ఎపీఓ లు ఏ నియోజక వర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన వారు శిక్షణ కొరకు ఆ నియోజక వర్గంలో రేపు మే2న గురువారం హాజరు కావాలని, సంబంధిత రిటర్నింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమ నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లు తప్పకుండా చేయాలని, ఆన్ హ్యాండ్ శిక్షణ ఇవ్వాలని సెక్టర్ అధికారులు, ఎంసిసి అధికారులను, అసెంబ్లీ నియోజకవర్గ శిక్షకులు అందరూ శిక్షణలో భాగస్వాములై పక్కాగా నిర్వహించాలని సూచించారు.
రోజు వారీగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ నేటి మే1 నుండి బీఎల్వోలు ప్రతి ఓటరు ఇంటికి వెళ్ళి సంబంధిత ఓటరుకు అందించాలని, రిటర్నింగ్ అధికారులు వెబ్సైట్ నందు నమోదు జరిగేలా చూడాలని అన్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గంలో అత్యంత జాగ్రత్తగా పంపిణీ చేయాలనీ సూచించారు. ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. తద్వారా సక్రమమైన ఎఎస్డి లిస్ట్ తయారు కావాలని సూచించారు. మే 6, 7 తేదీల్లో హోం ఓటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, రాజకీయ పార్టీల పోటీ చేస్తున్న అభ్యర్థులకు సమాచారం అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల కిషోర్, జిల్లా నోడల్ అధికారులు, నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.