Breaking News

జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఈ వి ఎమ్ ర్యాండమైజేషన్

-హాజరైన సాధారణ పరిశీలకులు , అభ్యర్ధులు
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా లో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీలో నిలిచిన అభ్యర్ధుల, వారి ప్రతినిధుల సమక్షంలో “ఈ వి ఎమ్ – ర్యాండమైజేషన్” ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని కలెక్టర్ /జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు.

స్ధానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజమండ్రీ పార్లమెంటు, రాజమండ్రీ రూరల్, రాజానగరం నియోజక వర్గాల, అనపర్తి , రాజమండ్రీ సీటీ, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాలు ఆయా నియోజక వర్గాల నందు ఈవిఎమ్ ల ర్యాండమైజేషన్ ఆయా అభ్యర్ధుల సమక్షంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమండ్రీ పార్లమెంటు, రాజమండ్రీ రూరల్, రాజానగరం అసెంబ్లి నియోజక వర్గాల ఈ వి ఎమ్ యూనిట్స్ (బి యూ, సి యూ, వివి పాట్స్) కలక్టరేట్ లో ర్యాండమై జేషన్ చెయ్యడం జరిగిందన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సమక్షంలో పూర్తి పారదర్శకంగా ఈవిఎమ్ లకి చెందిన యూనిట్స్ కేటాయింపులు జరిపా మన్నారు. తదుపరి నియోజక వర్గాల వారీగా ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల సమక్షంలో ఎన్ని రౌండ్ల ర్యాండమైజేషన్ చెయ్యాలో అడిగి ఆమేరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 1,577 పోలింగు కేంద్రాలకు చెందినా ఈవిఎమ్ యూనిట్స్ కేటాయింపులు జరిగిందన్నారు.

తొలుత పార్లమెంటు నియోజక వర్గానికి చెందిన ఈ వి ఎమ్ యూనిట్స్ ర్యాండమైజేషన్ అసెంబ్లి వారీగా ర్యాండమైజేషన్ మూడు రౌండ్ల ను చేసి, మూడో రౌండ్ ను నిర్దారణ చెయ్యడం జరిగిందన్నారు. బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్స్ 20 శాతం అధికంగా , వివి పాట్స్ 30 శాతం అధికంగా కేటాయింపు జరపడం జరిగిందన్నారు. వాటి వివరాలు ఆయా అభ్యర్థులకు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాకి సంబంధించి సాధారణ ఎన్నికల పరిశీలకులు కే. బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోఛ్, జాయింట్ కలెక్టర్ ఎన్ .తేజ్ భరత్ , జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు , ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *